
Thalliki Vandanam
తల్లికి వందనం డబ్బులు వెనక్కి తీసుకుంటారా? అపోహలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది
తాజాగా ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకంపై ఒక అపోహ వైరల్ అవుతోంది. “ఖాతాలో జమ అయిన డబ్బును 10 రోజుల్లో విత్డ్రా చెయ్యకపోతే ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది” అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్… ఇది పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సొమ్మును ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని ప్రకటించింది.
అందువల్ల తల్లికి వందనం సొమ్ము పొందిన వారు భయపడాల్సిన అవసరం లేదు. మీ డబ్బు మీ ఖాతాలోనే ఉంటుంది, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు.
Thalliki vandanam latest news , thalliki vandanam update , thalliki vandanam status check 2025, thalliki vandanam latest news in telugu